![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో ఆటతీరు, ఒక్కో మాటతీరు ఉంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో శ్రీహాన్ కన్నింగ్ ప్రేక్షకులకు స్పష్టంగా అర్థం అయ్యింది.
బిగ్ బాస్ కమల్ హసన్ గా పిలుచుకునే శ్రీహాన్.. మొదటి నుండి ఒక్కొక్క హౌస్ మేట్ దగ్గర ఒక్కోలో నటిస్తూ వస్తున్నాడు. ఎలా అంటే శ్రీసత్యతో గొడవపడితే రేవంత్ కి చెప్పుకోవడం. రేవంత్ గురించి శ్రీసత్య దగ్గర మాట్లాడటం. ఒక వీక్ లో "ఏంటి శ్రీహాన్.. సోమవారం నుండి శుక్రవారం ఒకలా కన్పిస్తావ్. శని, ఆదివారాలలో మరోలా కన్పిస్తావ్.. కన్పించడం కాదు నటించడం. ఎందుకు నటిస్తావ్?" అని అన్నాడు.
నాగార్జున చెప్పినా సరే శ్రీహాన్ ఏ మాత్రం మారలేదు. ఎందుకంటే తను చేసే యాక్టింగ్ తో ప్రేక్షకులను నమ్మించాలి కదా.. నమ్మించడం అనే దానికంటే జీవించడం అంటే సరిపోతుంది.. అంతలా పర్ఫామెన్స్ చేస్తూ వస్తున్నాడు శ్రీహాన్. "హౌస్ లో ఉండటానికి ఎవరిని అనర్హులుగా భావిస్తున్నారో? ఎవరి అభిప్రాయం వారు చెప్పండి" అని బిగ్ బాస్ అడిగిన ప్రతీసారి.. శ్రీహాన్ ఒక్క రోహిత్ పేరు మాత్రమే చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే రోహిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్. ఇలాంటి పర్సన్ ఉన్నాక, ఇక నాకేం ఓట్లు వేస్తారని అనుకున్నట్టున్నాడో ఏమో. అయితే ఇది చూసినవాళ్ళంతా శ్రీహాన్ ని " @కమల్ హాసన్" అని ట్రోల్స్ చేస్తున్నారు.
![]() |
![]() |